MLC Kavitha: మూడోరోజు ముగిసిన కవిత ఈడి కస్టోడియల్ ఇంటరాగేషన్
MLC Kavitha: 100 కోట్ల ముడుపులను ఎలా చెల్లించారని ప్రశ్నలు
MLC Kavitha: మనీలాండరింగ్ కేసులు విచారణ ఎదుర్కొంటున్న కవితను మూడో రోజు ఈడీ ప్రశ్నించింది. ఆధారాలు ముందుంచి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇండో స్పిరిట్‌లో 33 శాతం వాటా ఎలా వచ్చిందని.. 100 కోట్ల ముడుపులు ఎలా చెల్లించారని ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కాగా.. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరుతూ.. పిటీషన్‌లో పేర్కొన్నారు కవిత తరపు న్యాయవాది. మరోవైపు తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతించాలని కోరుతూ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత మరో పిటీషన్ దాఖలు చేశారు. కవిత అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తల్లితోపాటు కుమారులను కలుసుకునేందుకు అనుమతించింది. కస్టడీలో ఉన్న ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు.. బంధువులను కలిసేందుకు కవితకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది.