కుషాయిగూడ 'డీ మార్ట్‌' సీజ్‌

Update: 2021-01-08 12:50 GMT

'డీ మార్ట్' కదా క్వాలిటీ మేంటైన్‌ చేస్తారు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కుషాయిగూడ 'డీ మార్ట్‌లో' జరిగిన ఘటన చూస్తే షాక్ అవ్వాల్సిందే. గత నెల 30న కుషాయిగూడ శివసాయి నగర్‌కు చెందిన వినియోగదారుడు పద్మారెడ్డి.. తన డెబిట్ కార్డుతో ఇంటి కిరాణా సామానుతో పాటు కిమియా డేట్స్ కంపెనీకి చెందిన 20 ప్యాకెట్ల ఖర్జూర పండ్లను కొనుగోలు చేశాడు.

ఇక ఇంటికొచ్చిన పద్మారెడ్డి ఖర్జూర పండ్లను తిందామని సీల్ ఓపెన్ చూసి చూడగా లోపల కుళ్లిపోయిన ఖర్జూరాలు దర్శనమిచ్చాయ్. దీంతో అవాక్కయిన వినియోగదారుడు ప్యాకింగ్ తేదీని పరిశీలించగా డిసెంబర్ 2020గా ప్యాకెట్‌పై ఉంది. అలాగే ఆప్యాకెట్‌పై ఆరునెలల గడువు ఉన్నప్పటికీ ఖర్జూర పండ్లు పూర్తిగా కుళ్ళు పోయిన స్థితిలో దర్శనమిచ్చాయ్.

కిమియా డేట్స్‌ కంపెనీకి చెందిన ఖర్జూర ప్యాకెట్ల ప్యాకింగ్ తేదీ కరెక్ట్‌గా, ప్యాకెట్ సీల్ మంచిగా ఉన్నప్పటికీ లోపల మాత్రం పళ్ళు కూలిపోయి, దుర్వాసన రావడంపై వినియోగదారుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై సంబంధిత కిమియా డేట్స్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

డీ మార్ట్ షాపింగ్ మాల్‌లో నాణ్యత గల వస్తువులు ఉంటాయని నమ్మకంగా కొనుగోలు చేస్తే మోసపూరితంగా ప్యాకింగ్ డబ్బాలు విక్రయిస్తున్నారని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించని క్రిమియా డేట్స్ కంపెనీపై, మోసపూరితంగా విక్రయం చేస్తున్న కుషాయిగూడ డీమార్ట్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు.

వినియోగదారుడు పద్మారెడ్డి ఫిర్యాదుపై స్పందించిన కాప్రా మున్సిపల్‌ AMHO డాక్టర్‌ మైత్రేయి కుషాయి గూడ డీ మార్ట్ షాపింగ్ మాల్‌పై కొరడా ఝళిపించారు. ఆ డి మార్ట్‌ను తనీఖీ చేసి పోలీసుల సహాయంతో దాన్ని వెంటనే సీజ్ చేశారు.

Full View


Tags:    

Similar News