శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు.. సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

Sri Ram Sagar Project: 300 కి.మీ. కాళేశ్వరం నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీరు

Update: 2023-07-08 11:46 GMT

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు.. సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు 

Sri Ram Sagar project: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. వరదకాలువ మీదుగా దిగువ నుంచి ఎగువకు రివర్స్‌ పంపింగ్‌ చేస్తూ SRSP ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. వరదకాలువ మీదుగా దిగువ నుంచి ఎగువకు రివర్స్ పంపింగ్ చేస్తూ నీటిని తీసుకొచ్చి SRSP ప్రాజెక్టులోకి చేరడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముప్కాల్ లో నిర్మించిన పునరుజ్జీవ పథకం మూడో పంపుహౌస్ ద్వారా ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసీన ఘటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 300 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువకు నీటిని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ అపర భగీరథుడు అనీ రైతులు కొనియాడుతున్నారు. తమ జీవితంలో ఇలాంటి అరుదైన ఘట్టం చూడలేమని, ఇక తమ పంటలకు డోకా లేదని అంటున్నారు. SRSP ప్రాజెక్టులోకి వరద కాలువ ద్వారా చేరుకున్న నీటిని చూస్తూ రైతులు సంబర పడ్డారు. 

Tags:    

Similar News