కొండలు, కోనల్లో కొలువైన కదిలే పాపహరేశ్వర ఆలయం.. దర్శించుకుంటే...
Kadile Papa Hareshwar Temple: ఎటు చూసినా పచ్చని చెట్లు ... చుట్టూ దట్టమైన అడవులు... పక్కనే గలగలా పారే సెలయేళ్లు...
Kadile Papa Hareshwar Temple: ఎటు చూసినా పచ్చని చెట్లు ... చుట్టూ దట్టమైన అడవులు... పక్కనే గలగలా పారే సెలయేళ్లు... ఆకాశాన్ని తాకుతూ కనిపించే పర్వత శిఖరాల మధ్య కొలువై ఉంది పాపహరేశ్వరాలయం.. పరమశివుడు ప్రతిష్టించిన మహాలింగం. దాని ముందే యాగంటి బసవన్నను తలపించే నంది విగ్రహం... అమ్మ అన్నపూర్ణతో కలిసి జంగమయ్య కొలువైన దివ్యక్షేత్రం భక్తుల కొంగు బంగారంలా విరాజిల్లుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో కొలువు దీరిన ఆ పరమశివున్ని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.
పరమశివుడు ప్రతిష్టించిన శివలింగానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దివాల్‌పూర్‌లోని అటవీ ప్రాంతంలో 32వ శివ లింగాన్ని ఏర్పాటు చేశాడు. పరమ శివుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై మాతృహత్యాపాతకం నుంచి విముక్తి ప్రసాదించాడట. పరశరాముడు సంతోషంతో శివుడు కదిలే అంటూ శివతాండవం చేశాడని స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని కదిలే పాపన్న ఆలయంగా పిలుస్తున్నారు.
కదిలి పాపహరేశ్వర ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజున పుణ్యాహవచనం, గణపతి గౌరీ పూజలు, ధ్వజారోహణ నిర్వహిస్తారు. మరుసటి రోజు శివ పార్వతుల కల్యాణం, పల్లకి సేవ, లింగోద్భావ అభిషేకాలు జరుపుతారు. చివరి రోజున నాగవల్లి సేవలు, అన్నదాన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి.