Jurala Project: నిండిన జూరాల.. శ్రీశైలానికి వరద ప్రవాహం
Jurala project: తెలంగాణలోని జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని కుర్వపూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరి నిండుకుండలా మారింది.
Jurala Project: తెలంగాణలోని జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని కుర్వపూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరి నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి 83,779 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 75 వేల క్యూసెక్యుల నీరు ఈ డ్యామ్‌లోకి వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తివేశారు. జూరాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 318.100 మీటర్ల వరకు చేరుకుంది. దీంతో డ్యాంలో ప్రస్తుతం 8.810 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండితే 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.ి
ఇక జూరాల ప్రాజెక్టు నుంచి 87,317 క్యూసెక్కుల నీటిని వదులుతుండడంతో శ్రీశైలం బరాజ్‌లోకి 86,203 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుండగా ఇప్పటికే 831.40 అడుగుల నీరు ఉన్నది. అయితే ఇప్పుడు డ్యాంలో 55.87 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక పోతే ప్రియదర్శిని ప్రాజెక్ట్గ్ గా పిలువబడే జురాలా ప్రాజెక్ట్ తెలంగాణలోని జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని కుర్వపూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు కృష్ణ నది మీదుగా 1045 అడుగుల స్థాయిలో ఉంది. 1995 సంవత్సరంలో ప్రారంభించిన ఈ విద్యుత్ ప్రాజెక్టు 11.94 టిఎంసి సామర్థ్యం కలిగి ఉంది.