Amnesia Pub Case: సంచలనం సృష్టిస్తున్న జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్
Amnesia Pub Case: బాధితురాలికి న్యాయం జరగాలని ప్రతిపక్షాల ఒత్తిడి
Amnesia Pub Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు టోటల్‌గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. బాధితురాలికి న్యాయం జరగాలని ప్రతిపక్షాలు పోలీసులు, అధికార టీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు.
నిన్న రాత్రి జూబ్లిహిల్స్ లోని ఆమ్నేషియా పబ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్ ఘటనను నిరసిస్తూ NSUI ఆందోళన చేపట్టింది. పబ్‌ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పబ్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో రాత్రి అక్కడంతా గందరగోళ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే ఈ కేసులో ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్ట్ లో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. కేసులో అత్యంత కీలకంగా మారిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులోనే బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు మొత్తానికి ఈ కారు కీలకంగా మారింది. వాహనంలో లైంగిక దాడి జరిగితే పలు సాంతకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే క్లూస్ టీం కార్ లోని ఆధారాలను సేకరించే పనిలో ఉంది. అయితే ఆధారాలు చెరిపివేసిన తర్వాతే కారును పోలీసులకు దొరికేలా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ను ఎంతమేరకు సేకరిస్తారో అనేది సవాల్ గా మారింది.
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో కొన్ని ఫోటోలను, ఒక వీడియోను బయటపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు, ఆ రోజు రెడ్ కలర్ బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను మీడియాకు చూపించారు. అందులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని, ఆయినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ఆమ్నేషియా పబ్ లో పార్టీ నిర్వహించిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిషాన్, ఆదిత్య, ఇషాన్ పార్టీ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ కార్పొరేట్ స్కూల్ ఫేర్ వెల్ పార్టీ కోసం పబ్ బుక్ చేసినట్లు గుర్తించారు. 150 మంది విద్యార్థుల కోసం పబ్ బుక్ చేశారు నిర్వాకులు.