Amnesia Pub Case: నేరం ఒకరిపై ఒకరు నెట్టేసుకునే ప్రయత్నం చేస్తున్న మైనర్లు
Amnesia Pub Case: మైనర్లకు పొటెన్సీ టెస్టుల అనంతరం గంటపాటు విచారణ
Amnesia Pub Case: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే తమ కస్టడీలో ఉన్న మైనర్లకు ఉస్మానియా ఫొటోన్సీ టెస్టుల అనంతరం జూబ్లిహిల్స్ పీఎస్ పరిధిలో సుమారు గంటపాటు విచారించారు. ఈసందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ముగ్గుర మైనర్లను, A1నిందితుడు సాదుద్దీన్ విడి విడిగా విచారించిన ఇన్వెస్టిగేషన్ అధికారి ఏసీపీ సుదర్శన్ వారి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే అత్యాచార ఘటనలో ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసే ప్రయత్నం చేసుకున్న మైనర్లు తమను రెచ్చగొట్టింది ఏ1 నిందితుడే అని స్టేట్మెంట్ ఇచ్చారు. తొలుత ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకే అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు.
ఇక బెంజ్ కారు లో మొదట ఎంఎల్ఏ తనయుడు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పిన మైనర్లు ఆతర్వాత వారినే తాము అనుసరించామని చెప్పారు. ఇక కాన్సు బేకరి నుండి మార్గం మధ్యలోనే MLA కొడుకు వెళ్లిపోయినట్లు మైనర్లు వివరణిచ్చారు. ఆతర్వాత కాన్స్ బేకరిలో పార్క్ చేసి ఇన్నోవలో ఇదుగురం వెళ్ళామని చెప్పారు. ఈ ఘటన అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో తామంతా ఎస్కేప్ అయ్యామని స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇక ఈ విచారణ సందర్భంగా మైనర్లతో ఓ ఛానెల్ సీఈవో కొడుకు ప్రమేయం ఉందన్న అంశంపై ఆరా తీసిన పోలీసులు.. విచారణ అనంతరం వారిని సైదాబాద్ లోని జువెనైల్ హోం కు తరలించారు. ఇక రేపటి నుండి మరో మూడు రోజులపాటు మైనర్లను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ఈకేసులో ప్రధాన A1 నిందితుడి మూడో రోజు విచారణ ముగిసింది. రేపు చివరి రోజు సాదుద్దీన్ ను పీఎస్ లోనే విచారించనున్నట్లు తెలుస్తోంది.