JP Nadda: అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మాబొరుసు లాంటివి

JP Nadda: కేసీఆర్ దళిత వ్యతిరేకి అని నడ్డా ధ్వజం

Update: 2023-11-27 10:15 GMT

JP Nadda: అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మాబొరుసు లాంటివి

JP Nadda: అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మాబొరుసు లాంటివని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా విమర్శించారు. భూమి, సముద్రం, ఆకాశంలో అన్నింటా కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ నడ్డా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పర్యటించారు. ఈ సందర‌్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని నడ్డా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ రాష్ర్టంలో అవినీతి రాజ్యం ఏలుతుందన్నారు. మోడీ హయాంలోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందన్నారు జేపీ నడ్డా.

Tags:    

Similar News