Komaram Bheem Death Anniversary: నేటికీ కొమురం భీం ఆశయాలు నేరవేరలేదంటున్న వారసులు

Komaram Bheem Death Anniversary: కొమురం భీం వీర మరణం పొంది 84 ఏళ్లు గడిచాయి.

Update: 2024-10-17 06:29 GMT

Komaram Bheem Death Anniversary: నేటికీ కొమురం భీం ఆశయాలు నేరవేరలేదంటున్న వారసులు

Komaram Bheem Death Anniversary: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 84వ వర్ధంతి వేడుకలు జోడేఘాట్‌లో ఘనంగా జరుగనున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్‌లో ఆదివాసీలతో పాటు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తారు. అయితే కొమురం భీం ఆశయాలు నేటికి నెరవేరలేదంటున్నారు ఆయన వారసులు. ఆయన పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందిస్తూ... ముందుకు సాగుతున్న కొమురం భీం జిల్లా ఆదివాసీలపై hm tv స్పెషల్ స్టోరి.

కొమురం భీం వీర మరణం పొంది 84 ఏళ్లు గడిచాయి. ఆదివాసీ గిరిజన కుటుంబంలో పుట్టిన కుమురం భీం ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలు వేధింపులపై పోరాటం చేశారు. 11 గ్రామాలను సంఘటితం చేసి నాటి నిజాం రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఆదివాసీ వీరుడు.. భీం. గెరిల్లా తరహా ఉద్యమంతో నిజాం రాజ్యంలో సంచలనం సృష్టించిన పోరాట వీరుడు భీం.... అంతటి మహనీయుడి గుర్తులు చెరిగిపోకుండా ఆదివాసీలు నిత్యం జాగ్రత్తలు తీసుకున్నారు. జోడేఘాట్‌లోని మ్యూజియంలో ఆయన వాడిన ఆనాటి ఆయుధాలు ఇతర సామగ్రి ప్రదర్శనలో పెట్టడంతోపాటు.. నాటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు బొమ్మల్ని తయారు చేశారు.

కొమురంభీం పోరాటతత్వాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ ఆయన స్ఫూర్తిని నింపుతున్నారు ఆదివాసీలు. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి జోడేఘాట్ చేరుకుని కొమురం భీం ఆనవాళ్లను పరిచయం చేస్తూ ఆయన వీరత్వాన్ని బోధిస్తున్నారు. ఆదివాసీ నాయకుడిగా నాడు చేసిన పోరాటం మరువలేదంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తున్నారు.

ఆనాడు నిజాంపై పోరాడి వీర మరణం పొందిన కొమురంభీం ఆశయాలు నేటికి నెరవేరలేదంటున్నారు ఆయన వారసులు. జల్... జంగిల్... జమీన్... అనే నినాదంతో కొమురంభీం పోరాటం చేశారు. కానీ ఆయన 84వ వర్ధంతి సమయానికి కూడా ఆయన ఆశయాలు నెరవేరలేదని వాపోతున్నారు కుటుంబసభ్యులు. పోడుభూములు, నిరుద్యోగ సమస్య, తాగునీటి సమస్య... ఇలా ప్రతిదీ ఆదివాసీ గూడాల్లో నేటికీ కనపడుతున్నాయి. కొమురంభీం వారసుడు.., ఆయన మనవడైన సోనేరావుకు నేటికీ సొంత ఇల్లు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News