TS Govt Jobs: నిరుద్యోగులు అలర్ట్.. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు..!
TS Govt Jobs: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సమాయత్తమవుతోంది.
TS Govt Jobs: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సమాయత్తమవుతోంది. ఇందుకోసం అన్ని శాఖలలో ఖాళీలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. గత కొన్ని రోజుల క్రితం అందరికి సకాలంలో వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో బస్తీ, పల్లె దవాఖానలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 97 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఈ నియామకాలను భర్తీ చేస్తారు. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు టీఎస్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ఫిబ్రవరి 28 దరఖాస్తులకు చివరితేది. ఇక అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 34 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. అలాగే అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో https://kothagudem.telangana.gov.in/ పరిశీలించవచ్చు. తర్వాత ఈ దరఖాస్తు ఫామ్‌ను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి.