నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ మాస్టర్ భార్య చిందులు

Jani Master wife: నార్సింగి పోలీస్‌స్టేషన్‌కి జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకున్నారు.

Update: 2024-09-19 09:23 GMT

నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ మాస్టర్ భార్య చిందులు

Jani Master wife: నార్సింగి పోలీస్‌స్టేషన్‌కి జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకున్నారు. జానీ మాస్టర్‌కి వచ్చిన ఫేక్ కాల్‌పై సమాచారం తెలుసుకోవడానికి వచ్చినట్టు జానీమాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా తెలిపారు. కాగా జానీమాస్టర్‌‌ను గోవాలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ SOT పోలీసులు బయలుదేరారు.

అయితే జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొనడంతోస్టేషన్‌కు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కేసు విషయమై స్పందన అడిగిన మీడియా ప్రతినిధులపై ఆయేషా చిందులేశారు. నాకే కెమెరా పెడతారా... మీపై కేసు పెడతానంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News