Jagga Reddy: బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదు
Jagga Reddy: నేను గెలిస్తే సంగారెడ్డిలో ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని.. బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారు
Jagga Reddy: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలపై జగ్గారెడ్డి ఫైరయ్యారు. సదాశివపేట్ మండలం తంగేడపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారటా..? జగ్గారెడ్డిని గెలిపిస్తే పెన్షన్, డబుల్ బెడ్ రూమ్స్, ఇతర స్కీమ్‌లు కట్ చేస్తామని.. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారన్నారు. బతికున్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టాలి కానీ.. చచ్చిపోయిన తర్వాత బిర్యానీ పెడితే ఎలా అని ప్రశ్నించారు. ఎవరేం మాట్లాడిన భయపడాల్సిన అవసరం లేదని... ఇక్కడ మావాళ్లు కూడా ఉన్నారు.. చూసుకుంటారని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలన్నారు జగ్గారెడ్డి.