Jagga Reddy: డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్ నింపిన జగ్గారెడ్డి

Jagga Reddy: ప్రజల ఫోకస్ తనపై ఉండేలా డిఫరెంట్ ఐడియాస్‌తో ముందుకు

Update: 2023-11-18 12:49 GMT

Jagga Reddy: డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్ నింపిన జగ్గారెడ్డి

Jagga Reddy: ఆయన రూటే సెపరేటు. ఆయన స్టైలే యమ నాటు. ఈ లీడర్ ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సెషనలే. ఆయన ఆహర్యం మాత్రమే కాదు.. ఆయన నడవడిక కూడా మిగతా నేతలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో అందరూ హంగామా హడావుడితో ప్రజల వద్దకు వెళుతుంటే ఈయనగారు మాత్రం సాధా సీదాగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. డప్పులు కొడుతూ, అరుగుల పై కూర్చుని ముచ్చట్లు పెడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా నిన్న ప్రచార రథం దిగి కిలోమీటర్ రన్నింగ్ చేసి కార్యకర్తలకు ముచ్చేటమలు పెట్టించారు. ఆయనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

సంగారెడ్డి నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఉర్రూతలుగిస్తున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి. సదాశివపేట మండలంలో ప్రచారం చేస్తున్న జగ్గారెడ్డి కార్యకర్తలను పరుగులు పెట్టించారు. ప్రచారంలో ఓ గ్రామానికి వచ్చిన జగ్గారెడ్డి ప్రచార రథం దిగి పరుగు అందుకోవడంతో కార్యకర్త కు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. చేసేదిమి లేక కార్యకర్తలు సైతం జగ్గారెడ్డి వెంట పరుగెత్తక తప్పలేదు.

57 ఏళ్ల వయస్సులోనూ జోష్ తో పరుగు పెడుతున్న జగ్గారెడ్డి వెంట పరుగెత్తడానికి కార్యకర్తలు ఆపసోపాలు పడ్డారు. 57 ఏళ్ల వయస్సులో నేనే ఇట్లా పరుగెత్తితే వయస్సు పిల్లలు మీరెట్లా ఉండాలంటూ కార్యకర్తలకు సవాల్ విసిరారు. సుమారు కిలో మీటర్ పాటు పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు జగ్గారెడ్డి.

ప్రచారానికి ఇంకా పదిరోజుల సమయం మాత్రమే మిగిలింది.. ప్రచారాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందని చెప్పడానికి సింబాలిక్ గా జగ్గన్న పరుగందుకున్నడనీ ఫైనల్ గా కార్యకర్తలు అర్థం చేసుకున్నారట.

Tags:    

Similar News