Aroori Ramesh: ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది నేనే
Aroori Ramesh: బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం
Aroori Ramesh: అభివృద్ధిలో వర్ధన్నపేట నియోజకవర్గం ముందున్నదని ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్థానని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో అరూరి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అరూరి రమేష్ అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.