Koushik Reddy: మండలికి డౌటేనా.. గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదు?

Koushik Reddy: తెలంగాణ రాజకీయాల్లో తక్కువ కాలంలో విస్తృతంగా చర్చలోకెక్కిన కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారా?

Update: 2021-08-13 10:46 GMT

Koushik Reddy: మండలికి డౌటేనా.. గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదు?

Koushik Reddy: తెలంగాణ రాజకీయాల్లో తక్కువ కాలంలో విస్తృతంగా చర్చలోకెక్కిన కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారా? మండలికి ఆయన పేరును పంపారా లేదా? ప్రమాణ స్వీకారం మాట అటుంచితే గవర్నర్ కోటాలో కౌశిక్‌ను నామినేట్ చేశారా? ఒకవేళ నామినేట్ చేస్తే గెజిట్ ఎందుకు విడుదల కాలేదు? ఆ ఫైల్ గవర్నర్ పేషీలో ఇంకా అలాగే ఎందుకు ఉంది? కౌశిక్‌ ఫైల్‌పై గవర్నర్ సంతకం ఎందుకు చేయలేదు? కౌశిక్‌ను మండలికి పంపడంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై అధినేత రివ్యూ చేస్తున్నారా? అసలింతకీ కౌశిక్‌రెడ్డి మండలికి వెళ్లినట్టా ఆగినట్టా?

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ కౌశిక్‌రెడ్డి వార్తల్లో వ్యక్తిగా మారారు. కాంగ్రెస్ లో ఉండి మంత్రి కేటీఆర్‌ను కలవడం, అధికార పార్టీతో టచ్‌లో ఉంటూ కోవర్టుగా పని చేశారనే ముద్ర వేసుకోవడం, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఆడియోలు లీకవ్వడం, కొంత గ్యాప్ తర్వాత అధికారికంగా గులాబీ కండువా కప్పుకోవడం ఇదంతా ఓ సీక్వెన్స్‌లా జరిగిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా నేరుగా సీఎం కేసీఆర్‌ కండువా కప్పి స్వాగతం పలికారు. అప్పటి నుంచే కౌశిక్‌కు ఎందుకంత ప్రయారిటీ అంటూ గుసగుసలు వినిపించాయి. అంతేకాదు ఎవ్వరూ ఊహించని విధంగా గవర్నర్‌ కోటాలో మండలికి పంపుతున్నట్టు ప్రకటించారు. కేబినెట్ తీర్మానం కూడా పూర్తయింది. ఇప్పుడా ఫైల్ గవర్నర్‌ పేషీలో ఉంది.

కట్ చేస్తే కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఏంటంటూ సీనియర్లు, ఉద్యమకారులు మండిపోతున్నారట. విపక్షాల కన్నా సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాదు హుజూరాబాద్‌లో కూడా భిన్న స్వరాలు వినిపించాయి. కౌశిక్‌రెడ్డిపై తొమ్మిది కేసులున్నాయంటూ ఎఫ్ఐఆర్‌తో సహా మీడియా ముందు పెట్టారు. అవే కేసుల చిట్టాను గవర్నర్ పేషీకి పంపారు. దాదాపు వారం పాటు హాటాట్గా సాగిన కౌశిక్ వ్యవహారం ఆ తర్వాత కాస్త సద్దుమణిగింది.

కానీ కౌశిక్ ఎమ్మెల్సీ అయినట్టా కాదా ఇదే తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ. ఇంతకీ కౌశిక్‌ను మండలికి పంపుతున్నట్టు గవర్నర్‌కు దస్త్రం చేరిందా? ఒకవేళ చేరితే ఆ ఫైల్‌పై గవర్నర్ తమిళసై ఎందుకు సంతకం చేయలేదు? గవర్నర్ తమిళసై అందుబాటులోనే ఉన్నా ఈ ప్రస్తావనే ఎందుకు రాలేదని రాజ్‌భవన్‌ వర్గాలే చెబుతున్నాయి. కౌశిక్‌రెడ్డిని మండలికి పంపితే వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకునే కేసీఆర్‌ ఒక అడుగు వెనక్కి వేశారేమోనని విశ్లేషకులు అంటున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత తన నిర్ణయాన్ని పునరాలోచిస్తారేమోనని సందేహిస్తున్నారు. మరి కౌశిక్ ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెడుతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News