ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఇంటర్ నెట్ సౌకర్యం

Internet Facility In Govt Schools : చాలామంది పేద ప్రజలు తమ పిల్లలని ప్రయివేటు పాఠశాలల్లో చేర్పించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తుంటారు.

Update: 2020-08-20 09:31 GMT
ప్రతీకాత్మక చిత్రం

Internet Facility In Govt Schools : చాలామంది పేద ప్రజలు తమ పిల్లలని ప్రయివేటు పాఠశాలల్లో చేర్పించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తుంటారు. అయితే ఆ విద్యార్ధులు పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధిపై దృష్టి పెట్టింది. విద్యార్ధులకు పాఠశాలల్లో అన్నిరకాల సౌకర్యాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రథకం ప్రకారం ముందుగా రాష్ట్రంలోని రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లోని పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పూర్తయిన తరువాత ఇతర జిల్లాల్లో దశలవారీగా ఈ ఇంటర్నెట్ సదుపాయాన్ని అమలుచేయనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పాఠశాలలు కరోనా కారణంగా కొన్ని నెలలుగా మూతపడిన విషయం తెలిసిందే. ఇదే విధంగా మరికొన్ని రోజులు పాఠశాలలు మూతపడి ఉంటే విద్యార్ధుల చదువులు వెనకబడతాయనే ఉద్దేశంతో స్కూళ్లను తెరవకుండా పలు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఆన్ లైన్లోనే క్లాసులు బోధిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులను ప్రారంభిస్తే, ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చదువుతున్న వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ సర్కార్ గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించి పేద విద్యార్థులకు సైతం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చర్యలు చేపడుతోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. దీని ద్వారా 25 లక్షలకుపైగా విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు.


Tags:    

Similar News