Intermediate Online Classes: షిఫ్ట్ పద్ధతిలో ఇంటర్ తరగతులు!

Update: 2020-07-29 05:24 GMT

Intermediate Online Classes: కరోనా కారణంగా మూతపడిన తెలంగాణలోని జూనియర్ కాలేజీలను(Junior College) తెరిచి తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగానే 2020-21 విద్యా సంవత్సరంలో తరగతులను షిఫ్ట్ విధానంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డ్(Intermediate Board)  నిర్ణయిస్తున్నది. అదే విధంగా విద్యార్ధులను కూడా తరగతుల్లో ఎక్కువ సంఖ్యలో కాకుండా తక్కువ తీసుకోవాలని యోచిస్తుంది.

షిఫ్టు విధానంలో తరగతులను నిర్వహిస్తే మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5.30 వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులను నిర్వహించనున్నారని తెలిసింది. రాష్ట్రంలో వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ బోర్డు పెట్టిన ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి అమలు చేసే చర్యలతో విద్యాసంస్థలు తిరిగి తెరుస్తారు. ప్రతి ఎడాది ఈ సమయానికి తరగతులు ప్రారంభం అయి కొంత సిలబస్ పూర్తయ్యేది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా రెండు నెలల క్లాసులు వెనకపడినందుకు ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సెలవుల సంఖ్యను తగ్గించాలని బోర్డు ప్రతిపాదించింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక సబ్జెక్టులో మొత్తం సిలబస్‌లో 30 శాతం డిజిటల్ మోడ్ ద్వారా బోధిస్తారు. అకాడెమిక్ సెషన్ కోసం జూనియర్ కళాశాలలు తిరిగి తెరిచినప్పుడు బోధన-అభ్యాస పద్ధతిలో అంటే ఆఫ్‌లైన్, డిజిటల్ తరగతుల కోసం అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. డిజిటల్ రూపంలో బోధించే సిలబస్ మళ్లీ తరగతి గదుల్లో బోధించరు. డిజిటల్ తరగతుల విద్యార్థుల అభ్యాస స్థాయిలను అంచనా వేయడానికి, బోర్డు ఒక సబ్జెక్టులో ఇంటర్నల్స్ కోసం 20 మార్కులను ప్రతిపాదించింది. వీడియో కంటెంట్ ఇంటర్ బోర్డ యూట్యూబ్ ఛానల్, టీ-సాట్, దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌ల ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. ఈ అంచనా అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్టుల ద్వారా చేయబడుతుంది. చివరి స్కోర్‌లకు జోడిస్తారు.

ఇక ఈ విధానంపై ఇంటర్ బోర్డు అధికారులు మాట్లాడుతూ "ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని ప్లాన్ చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతి పొందిన తరువాత ఆఫ్‌లైన్, డిజిటల్ తరగతులు విద్యార్థులకు అందుబాటులో వస్తాయన్నారు. ఉదయం, మధ్యాహ్నం తరగతులు నిర్వహించడానికి షిఫ్ట్ వ్యవస్థ కోసం ప్రణాళికలు కూడా ఉన్నాయని తెలిపారు.




Tags:    

Similar News