తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తర, ఈశాన్య గాలులతో పెరుగుతున్న చలి

* కామారెడ్డి జిల్లాలో అతితక్కువ కనిష్ట ఉష్ణో్గ్రత.. ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల్లో చలి పంజా

Update: 2022-11-21 02:58 GMT

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Winters In Telangana: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో అతి తక్కువగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణ్‌పల్లిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతనమోదైంది. అదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10 డిగ్రీల సెల్సీయస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31.6 డిగ్రీల సెల్సీయస్‌గా రికార్డయ్యింది. సాధారణంగా ఈ సమయంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సీయస్‌ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడురోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Full View
Tags:    

Similar News