Viral Fever: తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా
Viral Fever: ఆస్పత్రుల్లో వేలాది మంది భాదితులు * తెలంగాణలో ఆస్పత్రులన్నీ కిటకిట
Viral Fever: తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తుండగా.. మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరిగిపోతోంది. పెరిగిన కేసులతో తగిన ఏర్పాట్లు చేశామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఒక్క ఆగస్టులోనే అత్యధికంగా 1700లకు పైగా కేసులు వచ్చాయి. మరోవైపు ఫీవర్ ఆస్పత్రిలో రోజుకు 2వేల మంది ఔట్ పేషంట్లు వస్తున్నారని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మూడు రెట్లు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.