Dengue Fever: రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు
Dengue Fever: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెరుగుతున్న బాధితులు * ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పేరిట భారీ వసూళ్లు
Dengue Fever: రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నపెద్ద తేడా లేకుండా అందరూ మంచాన పడుతున్నారు. పేషంట్స్‌తో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. మరో వైపు వైరల్ ఫివర్స్‌తో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతుండడంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ విజయ్ భాస్కర్ చెప్తున్నారు. కరోనా సమయం కాబట్టి డోనర్స్ ఎవరూ ముందుకు రావడంలేదని, ఇందకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అడ్డగోలుగా దోచుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం విషయంలో ఆలస్యం అవుతుందని, టెస్టులు కోసం బయట సెంటర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.
నల్లకుంటఫీవర్ హాస్పిటల్‌లో బెడ్స్ అందుబాటులో ఉన్నాయని RMO జయలక్ష్మి తెలిపారు. నెల రోజులుగా జ్వరాలతో రోగులు సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం రోజుకి 1300 పైగా ఓ.పి చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్స్ కొరత లేదని వైద్యులు చెబుతుంటే తీవ్ర కొరతతో ఇబ్బందులు పడుతున్నామని రోగులు అంటున్నారు.