కబ్జాలతో అందిన కాడికి దోచుకుంటున్న వ్యాపారులు

Update: 2020-08-27 07:31 GMT

Illegal ventures in Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పురపాలక, గ్రామపంచాయతీలకు దక్కాల్సిన లే - అవుట్ స్థలాలు దక్కకుండా పోతున్నాయి. వాటిని కనుగోలు చేసిన పేద, మద్య తరగతి ప్రజలు అడకత్తెరలో పోకచెక్కళ్ళ నలిగిపోతున్నారు. అయినా అధికారులు లే అవుట్లు గుర్తించిన అక్రమ వెంచర్లను నిరోధించటంలో అధికారులు విపలమవుతున్నారని మండిపడుతున్నారు స్థానికులు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లే అవుట్లు లేకుండా వెంచర్లు వెలుస్తుండగా, పురపాలక సంఘానికి చెందిన లే - అవుట్ స్థలాలు కనుమరగవుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను విలీనం చేసిన నాటి నుంచి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అక్రమార్కులు మున్సిపాలిటీ భూములపై కన్నేశారు. బోర్డులను తొలగించి దర్జాగా అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల ఏకంగా లే-అవుట్ల రికార్డులే మాయమయ్యాయి.

రియల్‌ ఎస్టేట్ వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతుండటంతో పురపాలక సంఘాలకు, గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన లేఅవుట్ స్థలాలు దక్కకుండా పోతున్నాయి. వెంచర్లను చేసినప్పుడు లే అవుట్ చేయకపోవడంతో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకి వచ్చే ఆదాయం కూడా రాకుండా పోతుంది. ఇలాంటి అక్రమ వెంచర్లు పేద, మద్య తరగతి ప్రజలకు రిజిస్ట్రేషన్ కాకుండా, ఇండ్లకు అనుమతులు రాక ఇబ్బందులు పడుతున్నారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 75 లే-అవుట్ స్థలాలుండగా వాటి పరిధులెక్కడ అనేది అధికారులకే తెలియదు. పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుండి 12 లే అవుట్ స్థలాలున్నాయని అధికారులు చెబుతుండగా మిగతా స్థలాలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. సిరిసిల్ల పరిధిలోని తంగళ్ళపల్లి మండలంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు రియల్ వ్యాపారులతో కుమ్మక్కాయరనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వెంచర్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమాలను ఆపాలని కోరుతున్నారు స్థానికులు.

Full View



Tags:    

Similar News