Covid-19 vaccine clinical trials: కోవిడ్-19 టీకా: ఐసీఎంఆర్ కీలక ప్రకటన
covid-19 vaccine clinical trials:భారత్ లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.
covid-19 vaccine clinical trials: భారత్ లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామన్న భారత్ బయోటెక్.. తాజాగా మరో ప్రకటన చేసింది. కరోనాకు వ్యాక్సిన్ తయారీ ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్ కు లైన్ క్లియర్ చేసిన ఐసీఎంఆర్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందని వెల్లడించింది. ఆలశ్యంగా నైనా ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మరింత లోతుగా పరిశీలించి, డేటా విశ్లేషణ చేసిన తరువాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతిస్తామని తెలిపింది.
మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 'కోవాక్సిన్' ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించింది.. ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది , ఇదిలావుంటే ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్‌ను ఆవిష్కరించాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ లేఖ రాశారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మానవులపై ట్రయల్స్ జరగకముందే వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఎలా నిర్ణయిస్తారని వైద్యనిపుణులు ప్రశ్నించారు. దీనిపై పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. దీంతో ఐసీఎంఆర్ స్పందించింది.. భారత్ బయోటెక్ ప్రీ క్లినికల్ డేటాను లోతుగా పరిశీలించిన తర్వాతే డ్రగ్స్ కంట్రోలర్ అనుమతిచ్చినట్టు ప్రకటనలో పేర్కొంది.