HYDRA: తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక

HYDRA: ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదిక

Update: 2024-08-25 09:43 GMT

HYDRA: తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక

HYDRA: ఇప్పటి వరకు కూల్చివేసిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో తెలిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్....కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావుకు చెందిన నిర్మాణం..మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం...ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆక్రమించిన 12 ఎకరాల భూమికి కబ్జా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపింది హైడ్రా. అలాగే బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ నిర్మాణం...నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం...కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడి నిర్మాణం కూల్చివేసినట్లు ప్రభుత్వానికి అందించిన నివేదికలో హైడ్రా పేర్కొంది.

Tags:    

Similar News