N Convention Demolish : హీరో నాగార్జునకు షాక్.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న హైడ్రా

N Convention Demolish : తుమ్మిడి చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని నాగార్జునపై ఆరోపణలు వస్తున్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ కట్టారని నాగార్జునపై హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు ఎన్ కన్వెషన్ సెంటర్ ను కూల్చివేసింది హైడ్రా .

Update: 2024-08-24 03:52 GMT

N Convention Demolish : హీరో నాగార్జునకు షాక్.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న హైడ్రా

N Convention Demolish : సినీనటుడు నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. మాదాపూర్ లోని నాగార్జనకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను సెంటర్ ను హైడ్రా కూల్చివేస్తోంది. భారీ బందోబస్త్ మధ్య కూల్చివేత పనులు జరిపిస్తున్నారు అధికారులు.తుమ్మిడి కుంట చెరువు కబ్జాచేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నాగార్జునపై ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి.

మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ కట్టారని నాగార్జున పై హైడ్రాకు పలువురు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్టీఎల్ కన్వెన్షన్ నిర్మించారని గతంలోనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే మీడియాను మాత్రం అక్కడికి అనుమతించడం లేదు. కూల్చివేతలు చిత్రీకరించడానికి మీడియాకు పర్మిషన్ లేదని బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Full View


Tags:    

Similar News