Hyderabadi IPS Officers Rejoin after corona Treatment: కరోనా నుంచి కోలుకొని విధుల్లో చేరిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు!
Hyderabadi IPS Officers Rejoin after corona Treatment:గత కొంత కాలం కింద ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకి కరోనా సోకింది. అనంతరం వీరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారు
Hyderabadi IPS Officers Rejoin after corona : కరోనా పై దేశం చేస్తున్న పోరాటంలో భాగంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలిసుల కృషి వెలకట్టలేనిది. ఇందులో పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా విధులు నిర్వహిస్తున్న సమయంలో కొన్ని చోట్లల్లో పోలీసులు కరోనా బారినా పడిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు తిరిగి విధుల్లోకి చేరారు. వారు ఎవరో కాదు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్, శిఖా గోయల్, తరుణ్ జోషి..
గత కొంత కాలం కింద ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకి కరోనా సోకింది. అనంతరం వీరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారు. చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం వీరు ఈ రోజు (గురువారం) తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆ ముగ్గురు అధికారులకి హైదరాబాద్ పోలీసులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ...కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని, దీనికి నివారణ ఒక్కటే అసలైన మార్గం అంటూ చెప్పుకొచ్చారు. కరోనా నుంచి కోలుకున్న పోలీసులు తిరిగి విధుల్లోకి చేరి సమాజానికి మంచి సందేశం ఇస్తున్నారని అన్నారు. అనంతరం ఆ ముగ్గురు అధికారులకి వారికి స్వాగతం పలుకుతూ వారితో కేక్ కట్ చేయించి బహుమతి అందించి అభినందనలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ లోని స్పోర్ట్స్ షూటింగ్ రేంజ్ లో వార్షిక కాల్పుల అభ్యాసానికి నగర పోలీసులకు చెందిన పోలీసు అధికారులు పాల్గోన్నారు.
ఇక తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. బుధవారం ఉన్న సమాచారం ప్రకారం తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 10I8 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరుణ వైరస్ కేసుల సంఖ్య 17,357 కి చేరింది. ఇందులో ప్రస్తుతం 9,008 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 8,082 మంది కోలుకున్నారు.
Welcome Corona Conquerors. At the Firing Range during half yearly Firing Practice. Shikha, Devendra,Tarun and others . pic.twitter.com/Er3rGVBVk4
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) July 2, 2020