హైదరాబాద్ టెకీ శ్వేత ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్!

Update: 2020-10-13 14:43 GMT

హైదరాబాద్‌ లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్వేత కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని తల్లిదండ్రులు అంటున్నారు. తమ బిడ్డను అజయ్‌ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మీడియా ఎదుట వాపోయారు. అజయ్‌ శ్వేతను రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి చంపేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అజయ్ ను కాపాడేందుకు డిపార్ట్ మెంటులోని కొంత మంది వ్యక్తులు కూడా సాయం చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

మంగళవారం శ్వేత తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. ''మా కుమార్తె శ్వేతకు పెళ్లి సంబంధాలు చూశామని వారు తెలిపారు. తన బీటెక్ క్లాస్ మెట్ అజయ్‌ని ప్రేమించానని చెప్పడంతో వారు అతన్ని పిలిచి పెళ్లికి ఒప్పించామని వారు స్పష్టం చేసారు. వారు చెప్పిన మాటలకు అజయ్ ముందుగా పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత అజయ్ పెళ్లికి నిరాకరించాడని తెలిపారు. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అంతే కాక తమ కూతురితో పర్సనల్‌గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వేధించేవాడని తెలిపారు. వారి కూతురిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడని వారు వాపోయారు. ఎప్పుడైనా డబ్బులు ఇవ్వకపోతే అతనితో దిగిన ఫొటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడని తెలిపారు. ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు.

నిందితుడు అజయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు, వీడియోల గురించి అతని తల్లిని వేడుకున్న ఆడియో టేపులు సోషల్ మీడియాలో డిలీట్ చేయాలని శ్వేత అభ్యర్థించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తన కూతురు శ్వేత చావుకు కారణమైన నిందితుడు అజయ్‌ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నా కూతురు చనిపోయిందని సెప్టెంబర్19 న పోలీసులు తెలిపారు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదన్నారు.

Tags:    

Similar News