Hyderabad CP Anjani Kumar about Coronavirus: కరోనా యుద్ధం వరల్డ్ వారు లాంటిది: హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
Hyderabad CP Anjani Kumar about Coronavirus: కరోనా యుద్ధం వరల్డ్ వారు లాంటిది అని నేను భావిస్తున్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు.
Hyderabad CP Anjani Kumar about Coronavirus: కరోనా యుద్ధం వరల్డ్ వారు లాంటిది అని నేను భావిస్తున్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ఇంటర్ నేషనల్ మార్కెట్ లో హైదరాబాద్ కి మంచి పేరు ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ సిటీలో మార్చ్ నుండి ఇప్పటి వరకు 24 గంటలుగా పబ్లిక్ సేఫ్టీ, కరోనా వరైస్ పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం అని అన్నారు. హైదరాబాద్ సిటీలో ఆర్మ్ ఫోర్స్ చాలా కీలకంగా పని చేశాయని అన్నారు. వినాయక చవితి దగ్గర నుండి కరోనా కట్టడి వరకు కార్ హెడ్ క్వాటర్స్ పోలుసులు కీ రోల్ పోషించారని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లో కరోనా తక్కువ ఉందని అన్నారు. కరోనా కట్టడి యుద్ధంలో ఫైటింగ్ చేసి వచ్చిన 62 మందికి స్వాగతం తెలుపుతున్నాం అని అన్నారు. కరోనా కష్ట కాలంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను తరలించామని తెలిపారు.
దేశంలోనే మొట్ట మొదటి సారిగా కరోనా టైంలో లింగంపల్లి నుంచి ట్రైన్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంతో పాటు వాతావరణం లో కూడా హైదరాబాద్ నెంబర్ 1 అని అన్నారు. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ గేషన్ ఆఫ్ క్రైమ్ అనేది మొదటి ప్రాధాన్యత ఉందన్నారు. జనవరి నుండి ఇప్పటి వరకు 316 పైన శిక్షలు పడ్డాయని తెలిపారు. 15 కేసుల్లో జీవిత కాలం శిక్షలు విధిస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుందన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో శిక్షలు పడడంతో ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. ప్రతి సెన్సేషనల్ కేసుకి నాలుగు రోజుల్లో ఆధారాలు సేకరించి కోర్ట్ ముందు ఉంచాలని అన్నారు. అలాగే ఆ నేరానికి పాల్పడిన నేరస్తుడని కూడా అరెస్ట్ చేయాలని పెట్టుకున్నామన్నారు. క్రైమ్ సీన్ తో పాటు మరి కొన్ని ఆధారాలు సేకరించి కోర్ట్ ముందు ఉంచినప్పుడు ఇలాంటి ఫలితాలు లభిస్తాయని అన్నారు.