హమ్మయ్య! సూరీడు కనిపించాడు.. ఉపిరి పీల్చుకున్న హైదరాబాద్!!

Hyderabad Rain updates : నాలుగు రోజుల భారీ వర్షాల అనంతరం హైదరాబాద్‌ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఉదయం నుంచి కాస్త ఎండ వస్తుండడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Update: 2020-10-15 06:50 GMT

Hyderabad Rain updates : నాలుగు రోజుల భారీ వర్షాల అనంతరం హైదరాబాద్‌ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఉదయం నుంచి కాస్త ఎండ వస్తుండడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు పలుచోట్ల రోడ్లపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు అలాగే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఇంకా పూర్తిగా వాన ముప్పు తప్పలేదని అధికారులు చెబుతున్నారు. నగరవాసులకు ఇంకా ముప్పు పొంచి ఉందంటుంది వాతావరణ శాఖ.. గురువారం సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం పడొచ్చని హెచ్చరించింది.

మరోవైపు హైదరాబాద్‌లో 122 చోట్ల నాలాలు, చెరువులు పొంగి పొర్లాయి. దీంతో వందలాది కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండడంతో పాతబస్తీ మొత్తం అతలాకుతలమైంది. చరిత్రలోనే మూసీకి భారీగా వరద వచ్చి చేరింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అటు భాగ్యనగరంలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాలను సందర్శించారు. మైలర్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని పల్లెచెరువు వద్ద పరిస్థితిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ పరిశీలించారు. 

Tags:    

Similar News