వరద సాయం కోసం మీ సేవ కేంద్రాల దగ్గర క్యూ కడుతున్న బాధితులు

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీటమునిగాయి. బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 550 కోట్ల వరద సాయం ప్రకటించింది. ముంపునకు గురైన ప్రతి ఇంటికి 10వేలు సాయాన్ని అందించాలని నిర్ణయించింది.

Update: 2020-11-18 05:46 GMT

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీటమునిగాయి. బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 550 కోట్ల వరద సాయం ప్రకటించింది. ముంపునకు గురైన ప్రతి ఇంటికి 10వేలు సాయాన్ని అందించాలని నిర్ణయించింది. మీ సేవ కేంద్రాల ద్వారా ఆ మొత్తాన్ని బాధితుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో వరద బాధితులు మీ సేవ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల ఎదుట వరద బాధితులు భారీగా క్యూకడుతున్నారు. పేర్లు నమోదు చేసుకున్న మరుసటి రోజునే డబ్బు వారి ఖాతాల్లో బదిలీ అవుతుండటంతో.. మీ సేవ కేంద్రాల దగ్గర బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం అందించే పది వేల సాయం కోసం.. హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. అర్థరాత్రి దాటినా.. తమ పేర్లు నమోదు చేసుకునేందుకు క్యూలోనే నిలబడ్డారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద సాయం పంపిణీ కొనసాగుతుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ ప్రకటనతో ముంపు బాధితులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ.. తమ వరకు సాయం అందుతుందో.. లేదోనన్న భయంతో ముందుగానే మీ సేవ కేంద్రాలకు చేరుకుంటున్నారు.


Full View

Tags:    

Similar News