Hyderabad-Dubai Flights : కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ విమానాలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయిన విషయం తెలిసిందే. దీంతో విదేశీ ప్రయాణాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఎప్పుడెప్పుడు విమానాలు నడుస్తాయా ఎప్పుడు విదేశాలకు వెళ్లాలా అని కొంత మంద ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఆధికారులు శుభవార్త తెలిపారు.
అయితే అన్ని దేశాలకు వెళ్లేవారికి కాదు ఈ శుభవార్త కేవలం దుబాయ్ వెళ్లే వారికి మాత్రమే వర్తిస్తుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్‌కు విమాన సేవలను ప్రారంభించనున్నారు. ఇండియా యూఏఈ మద్య కుదిరిన ఎయిర్ ట్రాన్స్ ఎయిర్ పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం ఈ సేవలను పునరుద్దరిస్తున్నారు. హైదరాబాద్ నుండి దుబయ్ వెళ్ళటానికి అలాగే దుబాయ్ నుంచి నగరానికి తిరిగి రావడానికి ఎయిర్ ఎమిరెట్స్ అరేబియా విమాన సర్వీసులను ఉపయోగించుకొవచ్చునని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఆధికారులు తెలిపారు.
ఎమిరెట్స్ మంగళ, గురు, అదివారాల్లో నడిపిస్తుండగా ఫ్లై దుబయ్ సోమ,బుధ, శని వారల్లో సర్వీసులను నడిపిస్తుందని స్పష్టం చేసారు. అదే విధంగా ఎయిర్ అరేబియా బుధ, శుక్రవారం అదివారాల్లో నడుస్తాయి. షార్జా హైదరాబాద్ జర్నీ చేయలనుకునేవారు ఎయిర్ అరేబియా సర్వీసులను ఉపయయోగించుకోవాలని సూచించారు. కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ మేరకు ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుండి దుబయ్ షార్జాలకు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు అని ఆధికారులు తెలిపారు.