Hyderabad: కీచక ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావుపై వేటు

CI Nageswara Rao: క్రమ శిక్షణను అతిక్రమించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.

Update: 2022-10-11 06:00 GMT

Hyderabad: కీచక ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావుపై వేటు

CI Nageswara Rao: క్రమ శిక్షణను అతిక్రమించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. అందులో భాగంగానే మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీస్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నాగేశ్వరరావుపై వనస్థలిపురం పీఎస్‌లో అత్యాచారం, కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, రక్షణ కోసం వచ్చే వారిపై అఘాయిత్యాలకు పాల్పడే ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాజీ సీఐ నాగేశ్వరరావుతో పాటు మరో 54 మంది పోలీసు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితమే కండిషన్ బెయిల్‌పై నాగేశ్వరరావు విడుదలయ్యారు.

Tags:    

Similar News