Huzurabad By-Election: హుజూరాబాద్‌లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
*ఈనెల 30న హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ *బరిలో 30 మంది అభ్యర్థులు *నువ్వా-నేనా అంటున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు
Huzurabad By-Election: ఇవాళ సాయంత్రం 7గంటలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. 30న హుజూరాబాద్‌లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్‌లు నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడుతున్నారు.
ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఓటుకు ఇంత మొత్తమనేలా నగదు పంపిణీకి రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మద్యం సీసాలను పలుచోట్ల పంపిణీ చేశారనే ప్రచారం వినిపిస్తోంది. పోలింగ్‌కు ముందు రేపు, ఎల్లుండి లోలోపల జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్నాళ్లుగా అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా తాయిలాలు, ప్రలోభాలపర్వం అధికంగా కనిపించే వీలుంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా నియోజకవర్గంపై దృష్టి సారిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.