శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద
Srisailam Project: 10 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
Srisailam Project: శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ ఏడాది ఐదో సారి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద వస్తుండటంతో.. ప్రాజెక్ట్ 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2లక్షల 98వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 3లక్షల 43 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరుకుంది. నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.8 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రవాహం మరింత పెరిగితే మిగతా గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.