తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు.. 7 జిల్లాల్లో రూ. 253 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తింపు
Telangana: గొర్రెల స్కాంలో అవినీతి జరిగినట్టు కాగ్ రిపోర్టు
Telangana: తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల స్కామ్‌పై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గొర్రెల పథకంలో అక్రమాలను గుర్తించిన అధికారులు.. తాజాగా భారీ అవినీతి జరిగినట్లు కాగ్ రిపోర్టు వెల్లడించింది. గొర్రెలు కొనుగోలు చేయకుండానే.. కొన్నట్లు రికార్డుల్లో చూపించినట్లు కాగ్ రిపోర్టు తెలిపింది. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో దాదాపు 253 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. నకిలీ బిల్లులతో 92 కోట్ల రూపాయలు స్వాహా చేయగా.. గొర్రెల రవాణా పేరుతో మరో 68 కోట్ల రూపాయలు నొక్కేసినట్లు గుర్తించారు.