Election Code: ఎన్నికల కోడ్ అమలుతో పోలీసుల దూకుడు.. భారీగా నగదు పట్టివేత..

Election Code: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుతో పోలీసులు దూకుడు పెంచారు.

Update: 2023-10-10 12:03 GMT

Election Code: ఎన్నికల కోడ్ అమలుతో పోలీసుల దూకుడు.. భారీగా నగదు పట్టివేత..

Election Code: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుతో పోలీసులు దూకుడు పెంచారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 6 కోట్ల రూపాయలకు పైగా డబ్బు సీజ్ చేశారు పోలీసులు... హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు బంగారం, వెండి తరలింపుపై పోలీస్ నజర్ పెట్టారు.

ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో 3 కోట్ల 35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. వికారాబాద్ జిల్లాలో 9 లక్షల 50 వేలు జప్తు చేశారు. చాదర్‌ఘాట్‌లో 10 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు... చందానగర్‌లో 6 కిలోల బంగారం పట్టుకున్నారు. ఫిల్మ్‌నగర్‌లో 30 లక్షలు, వెస్ట్‌జోన్‌లో 25 లక్షల రూపాయల హవాలా నగదు సీజ్ చేశారు. బషీర్‌బాగ్‌లో భారీగా బంగారం, 300 కిలోల వెండి, అబిడ్స్‌లో 10 కోట్ల విలువ చేసే 15 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు పోలీసులు.

హైదరాబాద్ వనస్థలిపురంలో 4 లక్షల రూపాయలు, ఖమ్మం జిల్లాలో 9 లక్షల 80 వేలు, సత్తుపల్లిలో 5 లక్షలు, కల్లూరులో 4 లక్షల 80వేలు. కొణిజర్ల మండల కేంద్రంలో 2 లక్షలు, కరీంనగర్ రూరల్ మెుగ్ధుంపూర్ బస్‌స్టాప్ దగ్గర 3 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 11 లక్షల 50 వేలు సీజ్ చేశారు పోలీసులు...నారాయణఖేడ్ పోలీసు స్టేషన్ పరిధిలో 87వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. హైదారాబాద్ నిజాం కాలేజీ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్‌లో మద్యం సీసాలను సీజ్ చేశారు.

నిజామాబాద్ కమ్మర్‌పల్లిలో 5 లక్షల 40 వేలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు... నెక్లెస్‌‌రోడ్‌లోని ఐమాక్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌, ప్రగతినగర్‌, మధురానగర్‌, బోరబండ ప్రాంతాల్లో పరిధిలో వాహనాలను సోదాలు ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో బెల్టుషాపులపై ఆకస్మిక దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలు సీజ్ చేశారు. షాద్‌నగర్‌‌లో మూడు పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News