Rain Alert: హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
Weather Report: ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జులై 31వ తేదీ వరకు వాయుగుండంగా మారనుంది. ఈ కారణంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
Weather Report: భారత వాతావరణం తాజాగా తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ కారణంతో ఇవాళ ఒడిశా, ఉత్తరాంధ్రకు దగ్గరగా వస్తుంది. అది 31నాటికి వాయుగుండంగా మారుతుంది. దానికి అనుకూలంగా నైరుతీ రుతుపవనాలు చల్లగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వారంపాటూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జులై 31వ తేదీ వరకు వాయుగుండంగా మారనుంది. ఈ కారణంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
ఐఎండీ తెలిపిన శాటిలైట్ వివరాల ప్రకారం శుక్రవాం ఉదయం వేళ ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. ఇవి క్రమంగా తగ్గుతూ..ఉదయం 10గంటల తర్వాత మరింత తగ్గుతాయి. అయితే ఉదయం 10 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వర్షాలు జోరుగా కురుస్తాయి. మధ్యాహ్నం 1 తర్వాత ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సాయంత్రం 5గంటల తర్వాత పశ్చిమ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాత్రి 7 తర్వాత రాయలసీమలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అర్ధరాత్రి 12 తర్వాత హైదరాబాద్ సహా రెండు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు 31వ తేదీ తెల్లవారుజామున వరకు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకోండా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.