Corona Effect: కరోనా ఎఫెక్ట్‌తో హాస్టళ్ల మూసివేత

Corona Effect: ఇళ్లకు పయనమవుతున్న స్టూడెంట్స్ * నేటి నుంచి ఓయూ హాస్టల్‌ మెస్‌లు బంద్

Update: 2021-03-25 03:55 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona Effect: విద్యార్థులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యాసంస్థలు మొదలై రెండు నెలలు నడిచాయో లేదో.. అప్పుడే కొవిడ్ పంజాకు మళ్లీ మూత పడ్డాయి. దీంతో ఈ ప్రభావం అటు హాస్టల్స్‌పై పడింది. వసతి గృహాలు కూడా మూసేయాలని ఆదేశాలు రావడంతో మళ్లీ యువత ఊళ్లకు తిరుగుపయనం అవుతున్నారు.

రెండ్రోజుల క్రితం విద్యాసంస్థలు మూసివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేజీ టు పీజీ ఏదైనా ఆన్‌లైన్‌లోనూ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. యూనివర్శిటీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో హాస్టల్స్‌ తెరిచే ఉంటాయని భావించారు విద్యార్థులు. అయితే నిన్న ఆ పరీక్షలు కూడా వాయిదా వేస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ్టి నుంచి హాస్టళ్లు కూడా మూతపడనున్నాయి.

ఉస్మానియా యూనివర్శిటీలో కూడా హాస్టల్ మూతపడటంతో విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. వర్శిటీ అధికారుల ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి మెస్‌ కూడా బంద్‌ కానుంది. మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌కు తాళం వేయనున్నారు. దీంతో విద్యార్థులకు హాస్టళ్లు ఖాళీ చేసేందుకు నేటి మధ్యాహ్నం వరకు టైమ్ ఇచ్చారు.

Tags:    

Similar News