Telangana: తెలంగాణలో కొత్త జోనల్ సిస్టమ్

Telangana: తెలంగాణలో జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాద‌న‌ల‌కు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.

Update: 2021-07-01 01:30 GMT

Telangana Zonal System Recommendations

Telangana: తెలంగాణలో జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాద‌న‌ల‌కు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఆ వెంటనే కేంద్ర ఆమోదానికి అనుగుణంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. మార్పులకు ఈ సంవత్సరం ఏప్రిల్ 19న రాష్ట్రపతి ఆమోదం తెలిజేయగా... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చంది. దానినిన కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపగా... రాష్ట్రంలో అమలుకు వీలుగా తాజాగా జీవో 128 ఇచ్చింది. దీని ద్వారా జోనల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లే. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.

నారాయణపేట జిల్లాకు జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లాకు కాళేశ్వరం జోన్‌లో చోటు కల్పించారు. స్థానికంగా ఉన్న విజ్ఞప్తుల మేరకు వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్పు చేశారు. ఇక నుంచి అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు స్థానికతను ఖరారు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన జోనల్‌ వ్యవస్థ ద్వారా పూర్తిగా తెలంగాణ ప్రజలే ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమయ్యే అవకాశం కల్పించారు.

రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-1 పోస్టులు కూడా మల్టీ జోనల్‌ స్థాయిలోనే నియమిస్తారు. దీనివల్ల పూర్తిగా తెలంగాణ ఉద్యోగాలన్నీ తెలంగాణ‌ నిరుద్యోగులకే లభిస్తాయి. జిల్లాస్థాయి పోస్టుల్లో కూడా గ్రామీణ ప్రాంత జిల్లాల యువతకు ప్రాధాన్యం లభించే అవకాశం కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిగింది. మల్టీ జోనల్‌ పోస్టులు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకే ఎక్కువగా లభిస్తాయి.

జోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాలు

మొదటి జోన్ కేళేశ్వరం: ఆసిఫాబాద్ – కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగుజిల్లాలు.

రెండో జోన్న బాసర: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.

మూడో జోన్ రాజన్న : కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.

నాలుగో జోన్ భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ (గ్రామీణం), వరంగల్ నగరం (హన్మకొండ)

అయిదో జోన్ యాదాద్రి: సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగామ.

ఆరోజోన్ ఛార్మినార్: మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.

ఏడో జోన్ జోగులాంబ : మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు.

Tags:    

Similar News