హెచ్ఎంటీవీ మెగా బతుకమ్మ సంబురం.. అందరూ ఆహ్వానితులే...
hmtv Mega Bathukamma Samburam: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఏటా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి.
hmtv Mega Bathukamma Samburam: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఏటా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ వార్తా ఛానెల్ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటవ తేది శనివారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మెగా బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.
అక్టోబర్ 1న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌కి 10,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ సీఈఓ N లక్ష్మీ రావు మాట్లాడుతూ... కోవిడ్ కి ముందు బతుకమ్మ పండుగ ఘనంగా జరిపాము అయితే గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా బతుకమ్మ పండుగ జరపలేకపోయమని, కానీ ఈ సంవత్సరం సానుకూల వాతవారణం ఉన్నందున తెలంగాణ ప్రసిద్ధ పండుగను నిర్వహించాలకున్నామని తెలిపారు.
బతుకమ్మ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా జరుపుకునే పూల పండుగ. ఇది ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరిపి దుర్గాష్టమి రోజున ముగుస్తుంది. ఔషధ విలువలు కలిగిన పూలతో బతుకమ్మని పేర్చుకొని కుటుంబ సమేతంగా జరుపుకునే ఏకైక పండగ అని సీఈఓ లక్ష్మీ రావు అన్నారు.