Education Excellence Awards-2023: విద్యారంగంలో ప్రతిభావంతులకు hmtv అవార్డులు..

Education Excellence Awards-2023: విద్యారంగంలో ప్రతిభావంతులకు hmtv అవార్డులు..

Update: 2023-07-01 16:46 GMT

Education Excellence Awards-2023: విద్యా రంగంలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. రెండు రాష్ట్రాలు ఆకాశమే హద్దుగా పోటీపడుతున్నాయి. ఆరోగ్యకరమైన పోటీని మరింత ఉత్సాహపరిచేందుకు hmtv సంకల్పం చెప్పుకుంది. రెండు రాష్ట్రాల్లో విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన దిగ్గజాలకు hmtv అవార్డులు ప్రదానం చేసింది. ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్ 2023 అవార్డుల వేడుక హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఈరోజు అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో రాగి జావ ఇవ్వడం మంచి నిర్ణయని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్‌ పేద విద్యార్థులకు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తున్నారని.. ఎడ్యుకేషన్ రంగంలో కృషిని hmtv గుర్తించడం గొప్పవిషయమని అభినందించారు మంత్రి ఎర్రబెల్లి.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ విద్యకు పెద్దపీఠ వేస్తున్నారని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పక్క రాష్ట్రాల వారు చదువుకోసం తెలంగాణకు రావడం గొప్ప విషయమన్న సబితా.. తెలంగాణలో చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు కూడా వస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాల ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆణిముత్యాల్లాంటి విద్యార్థులు ఉన్నారని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 

Delete Edit


Tags:    

Similar News