మొదలైన 20వ ఎడిషన్ ఫోటోఫిన ఎక్స్‌పో 2023 హంగామా.. పోస్టర్ ఆవిష్కరించిన HMTV సీఈవో లక్ష్మి..
ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో ఫోటోఫిన ఎక్స్‌పో
EditPoint India: ఎడిట్ పాయింట్ ఇండియా తన 20వ ఎడిషన్ ఫోటోఫిన ఎక్స్ పో పోస్టర్‌ను HMTV సీఈఓ శ్రీమతి లక్ష్మి గారు తన కార్యాలయంలో ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ.. భారతదేశం నలుమూల నుండి ఎన్నో కంపెనీలు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయని ఇలాంటి టెక్నాలజీ షో ద్వారా ఏంతో మంది గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్స్ టెక్నాలజీ అప్డేట్ అయ్యి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని ఇంతమంచి ఎక్స్‌పోని నిర్వహిస్తున్న టీంని అభినందించారు.
ఎడిట్ పాయింట్ చైర్మన్ డా ఇప్పలపల్లి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27, 28, 29 తేదిలలో నార్సింగిలోని ది అడ్రెస్ కన్వెన్షన్ లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) మరియు వందే భారత్ ట్రస్ట్ సహకారంతో HMTV మీడియా పాట్నర్‌గా ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు .. 9 ఎకరాల సువిశాల ప్రాంగణం, 500కి పైగా ప్రముఖ కంపెనీలు అత్యంత టెక్నికల్ వాల్యూస్ తో ఫోటోఫిన ఎక్స్ పో ఏర్పాటు చేస్తున్నామని.. మొట్టమొదటి సారిగా ఫిల్మ్ & బ్రాడ్ కాస్ట్ రంగానికి చెందిన ఉత్పత్తులతో పాటుగా ప్రోడక్ట్ డెమోలు, వర్క్ షాపులు, ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి సంబందించి, ప్రముఖ ఫోటోగ్రాఫర్లని కలిసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఫోటోఫిన ఎక్స్‌పో అందించటం జరుగుతుందన్నారు.
ఫోటోఫిన ఎక్స్‌పోలో భిన్న సంస్కృతిని ప్రతిబంబించేలా రకరకాల ఫుడ్స్ ఎక్స్ పోలో కనువిందు చేయనున్నాయని వివరించారు. రాజకీయ, క్రీడా, ఫ్యాషన్, సినీ మొదలగు రంగాలనుండి ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొనబోతున్నారు. సినిమా, టీవీ, మీడియా, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, బిజినెస్, మ్యూజిక్, ఫుడ్, ఇన్నోవేషన్ మరియు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న NGO ఆర్గనైజేషన్స్ లో నిష్ణాతులు అయినటువంటి తొమ్మిది రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ ఎక్స్‌పోలో "వందే భారత్ భీష్మ విశిష్ట పురస్కార్ అవార్డ్స్" ప్రధానం చేయనున్నామని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ప్రముఖులతో ట్రైనింగ్ వర్కుషాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఈవెంట్‌కి మీడియా పార్ట్నర్ గా HMTV, THE HANS INDIA, ఫోటో స్పాట్, డిజిటల్ PR పార్టనర్ గా డిజిటల్ కనెక్ట్, ఈవెంట్ మేనేజిమెంట్ US Events, ఫోటో గ్రఫీ పార్టనర్ గా ఫోటోమామ వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో డిజిటల్ కనెక్ట్ నిఖిలు గుండా మరియు ఎడిట్ పాయింట్ చైర్మన్ డా ఇప్పలపల్లి రమేష్ పాల్గొన్నారు.
ఫోటోఫిన ఎక్స్‌పోలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి