స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా HMTV హాన్స్ ఇండియా ఆధ్వర్యంలో 75 డాక్టర్స్ 2022 కార్యక్రమం

75under 15: హైదరాబాద్ మీడియా టెలివిజన్ (HMTV) అదేవిధంగా ది హన్స్ ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా డాక్టర్ల కోసం ఒక ప్రత్యెక కార్యక్రమం నిర్వహించనున్నాయి.

Update: 2022-08-13 17:42 GMT

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా HMTV హాన్స్ ఇండియా ఆధ్వర్యంలో 75 డాక్టర్స్ 2022 కార్యక్రమం

75under 15: హైదరాబాద్ మీడియా టెలివిజన్ (HMTV) అదేవిధంగా ది హన్స్ ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా డాక్టర్ల కోసం ఒక ప్రత్యెక కార్యక్రమం నిర్వహించనున్నాయి. మహమ్మారి సమయంలో డాక్టర్లు చేసిన కృషి.. త్యాగాలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా '75 వైద్యులు 2022' పేరుతొ '75 మంది అత్యంత ప్రతిభావంతులైన వైద్యుల జాబితాను ఈ రెండు సంస్థలు ప్రకటించనున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 15న. దేశవ్యాప్తంగా ఎంపికైన ఈ 75 మంది ప్రఖ్యాత వైద్యులను ఆగస్టు 17న హైదరాబాద్‌లో జరిగే రెండు రోజుల కార్యక్రమంలో ఘనంగా సన్మానించనున్నారు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఈ 75 అవార్డులు అనారోగ్యం, క్యాన్సర్, కార్డియాక్ అరెస్ట్, ఎయిడ్స్, సంక్లిష్ట వ్యాధుల నుంచి ప్రజలకు లభించే స్వేచ్ఛను సూచిస్తాయి. HMTV 2009 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ఉనికిని కలిగి ఉన్న హైదరాబాద్ మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 24 గంటల ప్రముఖ తెలుగు వార్తా ఛానల్. HMTV దాని నైతిక జర్నలిజానికి ప్రసిద్ధి చెందింది. ప్రజల దృక్కోణాలను ప్రసారం చేయడం ద్వారా ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళనలో సముచిత స్థానాన్ని సాధించింది. NGOలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని రూపొందించే అంశంపై HMTV నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు.

ఢిల్లీ, బెంగళూరు ఇ-పేపర్ అదేవిధంగా నేషనల్ డైలీ బిజినెస్ ఇ-పేపర్ 'బిజ్ బజ్'తో సహా ఎనిమిది ఎడిషన్‌లను కలిగి ఉన్న 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల దినపత్రికను హైదరాబాద్ మీడియా హౌస్ ప్రచురిస్తుంది. "75 విద్యలు 2022 మహమ్మారి సమయంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్న చాలా మంది వైద్యులు అలాగే వైద్య ఆరోగ్య సంరక్షణ నిపుణుల అంకితభావం, త్యాగాలను గుర్తించడానికి మా వంతుగా చేసిన చిన్న ప్రయత్నం'' అని ది హాన్స్ ఇండియా ప్రతినిధులు చెప్పారు.

HMTV చెబుతున్న దాని ప్రకారం, 'ఫ్రీడం ఫ్రమ్ ఇల్ హెల్త్' పేరుతో ఒక ప్రత్యేకమైన షో ప్రారంభిస్తుంది. దీనిలో 75 మంది ఫీచర్ చేసిన వైద్యులు తమ ప్రయాణాన్ని పంచుకుంటారు. అలాగే వివిధ రకాల వ్యాధులపై వీక్షకులకు ఆరోగ్య చిట్కాలు, నివారణ చర్యలను అందిస్తారు. ఈవెంట్ శ్రావణి హాస్పిటల్స్, మాదాపూర్ అలాగే అసోసియేట్ స్పాన్సర్ మెట్రో కేర్ హాస్పిటల్స్, డిజిటల్, PR పార్టనర్ డిజిటల్ కనెక్ట్ ద్వారా నిర్వహిస్తారు.

Tags:    

Similar News