Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింతలో ఉద్రిక్తత
Wanaparthy: బీజేపీ నాయకులపై కట్టెలు, రాళ్లతో టీఆర్ఎస్ నేతల దాడి
Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింతలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటి పరిధిలోని ఒకటో వార్డులో గల 650 సర్వే నెంబర్లు పూర్వీకుల కాలం నుంచి ఉన్న సమాధులను ధ్వంసం చేసి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడానికి అధికార పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ... హిందూ స్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అమరచింత బస్టాండ్ ఆవరణలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఆందోళన ఇలా కొనసాగుతుండగానే మున్సిపల్ అధికారులు సోమవారం అర్ధరాత్రి సమయంలో సమాధులు జేసీబీ ల ద్వారా తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడి వెళ్లి అడ్డుకున్నారు. దీంతో బీజేపి నాయకులపై టీఆర్ఎస్ నాయకులు కట్టెలతో రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానిక బీజేపి నాయకులు మోర్వ రాజు, సురేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. మెర్వ రాజు పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమరచింతలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.