న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై టీసర్కార్‌కు హైకోర్టు షాక్‌

* రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలు ఎందుకు బ్యాన్‌ చేయలేదన్న కోర్టు * మీడియా కథనాలను సుమోటోగా విచారించిన ధర్మాసనం * ఓ వైపు కొత్త వైరస్ చాలా డేంజరస్‌ అని హెల్త్ డైరెక్టర్‌ చెబుతుంటే..

Update: 2020-12-31 07:50 GMT

తెలంగాణలో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది హైకోర్టు. మీడియా కథనాలను సుమోటోగా విచారించిన ధర్మాసనం రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలు ఎందుకు బ్యాన్‌ చేయలేదని ప్రశ్నించింది. ఓ వైపు కొత్త వైరస్ చాలా డేంజరస్‌ అని హెల్త్ డైరెక్టర్‌ చెబుతుంటే..వేడుకలకు ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఇయర్‌ వేడుకలకు పబ్‌లు, బార్లు విచ్చలవిడిగా ఓపెన్‌ చేసి ఏం చేయాలనుకుంటున్నారంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది.

ఇప్పటికే రాజస్థాన్‌, మహారాష్ట్రలో వేడుకలు బ్యాన్‌ చేశారని తెలిపింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా దృష్ట్యా వేడుకలు జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలపగా ఈరోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భౌతికదూరం, మాస్క్‌లు తప్పకుండా వినియోగించాలని స్పష్టం చేసింది. వేడుకలకు సంబంధించి పూర్తి నివేదికను జనవరి 7న సమర్పించాలని స్పష్టం చేసింది న్యాయస్థానం.

Tags:    

Similar News