తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Update: 2020-12-17 11:40 GMT

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ధరణి పోర్టల్‌పై ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని మండిపడింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అవసరం లేదని చెప్పిన ప్రభుత్వం స్లాట్ బుకింగ్‌, పి-టిన్‌‌కు ఎందుకు ఆధార్ నెంబర్ అడుగుతున్నారని ప్రశ్నించింది. ఆధార్ నెంబర్ అడగబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలమైందని మండిపడింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమ్మరీ లావాదేవీల్లో ఆధార్ నెంబర్ అడగడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే తమ ఆందోళనని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.

Tags:    

Similar News