ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఖరీదైన మందులు

Corona Vaccin : కరోనా బాధితులకు అందించే చికిత్సలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను సరఫరా చేసింది.

Update: 2020-08-09 04:41 GMT
ప్రతీకాత్మక చిత్రం

Corona Vaccin : కరోనా బాధితులకు అందించే చికిత్సలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను సరఫరా చేసింది. టీఎస్‌ఎంఐడీసీ- తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మొత్తం 50 వేల కొవిఫర్‌ ఇంజెక్షన్ల సరఫరాను శనివారం నాటికి పూర్తిచేసింది. కరోనా బాధితులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ ఈ డ్రగ్స్ ను అందరికీ అందుబాటులో ఉంచింది. సీఎం కేసీఆర్‌ చొరవతో భారీగా ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్‌ సంస్థ, ఇంకా అవసరమైతే ప్రజలకు అందుబాటులో మరో 50 వేల ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లుచేసింది. దీంతో కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉచితంగా మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు మార్గం సుగమమైంది.

ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రయివేటు ఆస్పత్రుల యాజమన్యాలు బాధితుల నుంచి రెట్టింపు ఫీజులను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటును మించిన వైద్యం అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ విలువైన, ముఖ్యమైన మందులను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే కరోనాకు సంబంధించిన కొన్ని మందులను జిల్లాల్లోని అన్ని ఆస్పత్రులకు పంపిణీ చేసింది. శనివారం నాటికి 5 లక్షల ఫావిఫిరావిర్‌ ట్యాబ్లెట్ల సరఫరాను పూర్తిచేసింది. మరో లక్ష హోం ఐసొలేషన్‌ కిట్లను కూడా జిల్లాలకు చేరవేసింది.

ఇక ప్రస్తుతం కరోనావైరస్ కు ప్రత్యేకంగా మందులు లేకపోవడంతో ఉన్న ఔషధాలతోనే బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ఈ మందుల్లో రెమ్‌డెసివిర్‌ ముఖ్యమైనది. ఈ ఔషధాలను అత్యవసర సమయాల్లో బాధితులకు ఇవ్వడం వలన రోగులు కోలుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో బుధవారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర అవసరాల కోసం రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు సరఫరాచేయాలని కోరారు. వెంటనే కొవిఫర్‌ పేరుతో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఉత్పత్తిచేస్తున్న హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథిరెడ్డితో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.




Tags:    

Similar News