SRSP: ఎస్సారెస్పీకి భారీగా వరద

SRSP: రికార్డు స్దాయిలో దిగువకు నీటి విడుదల * ఒక్క రోజులో 15 టీఎంసీలు వదిలిన అధికారులు

Update: 2021-09-09 06:58 GMT

 శ్రీరామ్ సాగర్ కు పెరిగిన నీటి ఉదృతి (ఫైల్ ఇమేజ్)

SRSP: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వచ్చే వరద విషయంలో అంచనాలు తప్పుతుండటంతో నీటిని ఖాళీ చేస్తున్నారు అధికారులు ఒక్క రోజులో 15 టీఎంసీల నీటిని దిగువకు వదిలేయడం ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా చెబుతుండటం గమనార్హం. ఎస్సారెస్పీలో 33 గేట్లను ఎత్తి దిగువకు 3లక్షల, 52వేల, 360 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తుండగా ఎగువ ప్రాంతాల నుంచి 3లక్షల, 25వేల, 520 క్యూసెక్కులు ఇన్ ఫ్లో రూపంలో వస్తోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎగువన మిగులు జలాలు నిలిచిపోవడంతో 15 టీఎంసీల నీటి సామర్ధ్యాన్ని తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News