Warangal: నిన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భీకర వర్షం

Warangal: నాన్‌ స్టాప్‌గా దంచికొట్టిన వాన * వాగులను తలపించేలా రహదారులు

Update: 2021-09-07 02:20 GMT

వరంగల్ లో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Warangal: ఏం వాన.. ఏం వాన.. ఆకాశానికి చిల్లుపడినట్లే అనిపించింది. మీది నుంచి ఎవరైనా నీళ్ల కుండను కుమ్మరించారా అనే ఫీలింగ్‌ను కలిగించింది. వరంగల్‌ జిల్లాను నిన్న వాన దేవుడు గట్టిగానే అరుసుకున్నాడు. నిమిషం గ్యాప్‌ లేకుండా దంచికొట్టాడు. దెబ్బకు ఓరుగల్లు నీరుగళ్లుగా మారిపోయింది. ఎక్కడ చూసినా వరద.. బురద. వాహనదారులయితే చుక్కలు చూశారు.

హన్మకొండ కొత్త బస్‌స్టాండ్‌, చౌరస్తా.. పెంట్రోల్‌ పంప్‌ అక్కడ ఇక్కడ అన్న తేడాలేదు. అన్ని సెంటర్లు అన్ని ప్రాంతాలు జలదిగ్భంధమయ్యాయి. పలు ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థల ఆవరణలు, పరిసరాలు నీటమునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు.. బురద నీరు చెట్టాపట్టాలేసుకొని రోడ్డెక్కాయి. దీంతో రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను మరిపించాయి.

వర్ష బీభత్సానికి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కమిషనర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ గోపి ప్రత్యేక అధికారులను మానిటరింగ్‌ చేయడానికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. మరో 48 గంటల పాటు అధికారులు అలెర్ట్‌గా ఉండాలని కలెక్టర్‌ గోపీ ఆదేశించారు.

Tags:    

Similar News