జలదిగ్బంధంలో హైదరాబాద్.. చెరువులను తలపిస్తున్న రహదారులు
Hyderabad Rains : హైదరాబాద్‌లో మరోసారి వాన దంచికొట్టింది. దీంతో నగర వాసులకు వరద కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. క్యుములోనింబస్ మేఘాల వల్ల మహానగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది.
Hyderabad Rains : హైదరాబాద్‌లో మరోసారి వాన దంచికొట్టింది. దీంతో నగర వాసులకు వరద కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. క్యుములోనింబస్ మేఘాల వల్ల మహానగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. దీంతో చెరువులకు తిరిగి వరద పోటెత్తింది. అటు తగ్గిందనుకున్న నాలాల ప్రవాహం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో రోడ్లన్నీ జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటితో కాలనీలు, బస్తీల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై నడుములోతున నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల ద్విచక్రవాహనాలు వరదలలో చిక్కుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అటు రంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం గ్రామంలో భారీ వర్షానికి చెరువు కట్ట తెగింది. దాంతో చెరువులోని నీరు అంతా గుంతపల్లి గ్రామంలోకి వచ్చింది. వరద తాకిడికి గుంతపల్లి గ్రామంలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రోడ్డు తెగిపోయింది. రాత్రంతా గుంతపల్లి గ్రామం జలదిగ్భంధంలోనే ఉండిపోయింది. గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ రాత్రంత భయంతో గడిపారు.
మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది. వరద నీరు రోడ్డుపైకి రావడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది..