Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యింది. అటు తెలంగాణలో మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది.

Update: 2024-10-15 06:12 GMT

Heavy rains in Hyderabad

Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యింది. అటు తెలంగాణలో మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది.

హైదరాబాద్ లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి తీవ్ర టాపిక్ జామ్ ఏర్పడింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, మాదాపూర్, కూకట్ పల్లి, సూచిత్ర ఏరియాల్లో కుండపోత వర్షం కురిసింది.

అటు రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. చక్రవాతపు ఆవర్తనం ఒకటి దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీక్రుతమైందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

కాగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తోపాటు ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్ , రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ తోపాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

Tags:    

Similar News